HNK: ఉదయం 10 దాటినా కూడా హన్మకొండ పట్టణ వ్యాప్తంగా పొగ మంచు వీడడం లేదు. పొగ మంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి పంజాకు తోడు మంచు మేఘాలతో జనజీవనం మందగించింది. పొగమంచు కారణంగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, ఫాగ్ లైట్లు ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు.