EG: కొవ్వూరు మండలం వేములూరుకు చెందిన గేల్లా గోవిందప్రసాద్ (38) మృతదేహం గురువారం గోదావరి నదిలో లభ్యమైంది. డిసెంబర్ 30న ఇంటి నుంచి వెళ్లిన ఆయన.. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 31న రోడ్డు కం రైలు వంతెనపై బైకును గుర్తించిన పోలీసులు గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.