AKP: సింహాచలం వరలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ‘రాపత్తి’ ఉత్సవాలు గురువారం మూడవ రోజుకు చేరుకున్నాయి.ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు,సీతారామాచార్యుల సారథ్యంలో శాస్త్రోక్తంగా ఈ వేడుకలు నిర్వహించారు. నవరత్న ఖచిత కిరీటం, కౌస్తుభ మణిహారాలు, సువర్ణ హారాలతో స్వామివారు తేజోమయంగా దర్శనమిచ్చారు.