WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని BRS పార్టీ కార్యాలయంలో ఇవాళ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. తీవ్ర చలిలో రైతులు యూరియా కోసం క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి రైతులకు యూరియా అందించాలని కోరారు.