కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ డీఐజీగా పదోన్నతి పొందారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ప్రమోషన్ ఇస్తూ.. ఉత్తర్వులు జారీ చేయగా గురువారం నుంచి ఆయన డీఐజీ హోదాలో ఛార్జ్ స్వీకరించారు. నూతన పోస్టింగ్ వచ్చే వరకు కర్నూలు జిల్లా ఎస్పీగానూ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 2012 ఐపీఎస్ అధికారి అయిన ఆయన ఈ ఏడాది ఫిబ్రవరి 1న జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు.