ప్రకాశం: ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. మార్కాపురానికి చెందిన షేక్ కరీముల్లా (50), మాచర్లకు చెందిన నూర్జహాన్ (45) బంధువులు కాగా, ఇద్దరూ ఫ్రూట్స్ వ్యాపారం చేస్తుంటారు. గురువారం మాచర్ల నుంచి మార్కాపురానికి బైకుపై బయలుదేరారు. అదే సమయంలో మహేశ్ బైకుపై మాచర్ల వైపు వెళ్తున్నాడు. శిరిగిరిపాడు వద్ద ఈ రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.