SRCL: ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన రైతు బొందుగుల దేవారెడ్డి తన పొలం నారుమడిలో నాయకుల పేర్లతో పెంచి అభిమానం చాటుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పేర్ల ఆకారంతో పెంచిన నారుమడి ఆకర్షిస్తుంది. నారుమడిని చూసేందుకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు.