NZB: బోధన్ నర్సీ రోడ్డులోని మారుతి మందిరం దుకాణ సముదాయంలోని దుకాణాన్ని రెండు సంవత్సరాలకు లీజుకు ఇవ్వనున్నటన్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. ఈ దుకాణానికి సంబంధించిన వేలం పాటను శుక్రవారం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వేలంలో పాల్గొనే వారు ముందుగా రూ.5,000 చెల్లించి నమోదు చేసుకోవాలని ఈవో రాములు తెలిపారు.