KMR: గాంధారి మండలంలో చలి పంజా విసురుతుంది. గత నెల రోజుల నుంచి రోజు రోజుకు చలి తీవ్రత అధికమవుతుంది. గ్రామాల్లో చలి తీవ్రతను తట్టుకునేందుకు చలి మంటలు ఏర్పాటు చేసుకుంటున్నారు. గుంపులుగా చలి మంటల చుట్టు కూర్చుని సరదా కబుర్లు చెప్పుకుంటు చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఇప్పుడే చలి ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుందో అని భయాందోళన చెందుతున్నారు.