PDPL: గోదావరిఖని పట్టణ శివారు గోదావరి నది బ్రిడ్జిపై ఇరువైపులా ఏర్పాటు చేసిన పూల మొక్కల కుండీలు అలంకారప్రాయంగా మిగిలాయి. రామగుండం కార్పొరేషన్‌కు సంబంధించిన సిబ్బంది వీటిని నిర్వహించాల్సింది ఉండగా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో కుండీలు చెత్త చెదారం, ఎండిపోయిన మొక్కలతో దర్శనమిస్తున్నాయని వాహనదారులు విమర్శలు చేస్తున్నారు.