KDP: దాడి ఘటనపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశామని గురువారం పోలీసులు తెలిపారు. ఒంటిమిట్టలోని ఉర్దూ పాఠశాల సమీపంలో నివాసముంటున్న షేక్ జబవుల్లాకు, అదే ప్రాంతానికి చెందిన కాసింకు కొంతకాలంగా గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో హబీవుల్లాపై హకీంతోపాటు ఆయన సోదరులు భౌతికంగా దాడి చేశారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.