కొమరం భీమ్ ఆసిఫాబాద్లో TSTWTU ప్రతినిధులు జిల్లా పాలనా అధికారి వెంకటేష్ ధోత్రేను నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. గిరిజన ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, ఉపాధ్యాయ సమస్యలపై చర్చించారు. యూనియన్ సూచనలకు కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు సభ్యులు తెలిపారు.