RR: షాద్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదురుగా ఓ విద్యుత్ స్తంభం ఒరిగి ప్రమాదకరంగా మారింది. మెయిన్ రోడ్డు కావడంతో వేలాది వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయని, ఒరిగిన స్తంభం రోడ్డు మీద పడితే భారీ ప్రమాదం జరగవచ్చని వాహనదారులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.