VZM: తెర్లాం మండలాన్ని పొగ మంచు కప్పేసింది. కొన్ని రోజులుగా దట్టమైన మంచు కురవడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఉదయం 7.30 గంటలైనా మంచు వీడకపోవడంతో బయటకు రావడం కష్టమైంది. వాహనదారులు లైట్లు వేసుకుని వాహనాలు నడపాల్సి వస్తోంది. చలి గాలుల వల్ల శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.