KNR: నూతన సంవత్సర వేడుకల వేళ KNR పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. మద్యం సేవించి వాహనాలు నడిపిన 281 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేశారు. అలాగే నంబర్ ప్లేట్లు, పత్రాలు లేని 224 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 1,267 ఈ-చలానాల ద్వారా రూ. 6.24 లక్షల జరిమానా విధించినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు.