శ్రీకాకుళం: జిల్లాలో శుక్రవారం ఉదయం పొగ మంచు కురుస్తోంది. దీంతో రహదారులపై ప్రయాణించే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో రాకపోకలు మందగించాయి. ముఖ్యంగా జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులపై వాహనదారులు హెడ్లైట్లు ఆన్ చేసి నెమ్మదిగా ప్రయాణిస్తున్నారు. ఈ మంచు వలన జీడీ, మామిడి పూతలకు ఇబ్బందని రైతులు వాపోతున్నారు.