యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రభాస్ అన్నయ్య పెళ్లి చేసుకున్న మరుసటి రోజు 12 గంటలకే నేను పెళ్లి చేసుకుంటా’ అని చమత్కరించాడు. తన కొత్త సినిమా ‘అనగనగా ఒక రాజు’ ప్రమోషన్లలో ఆయన ఈ మాటలన్నాడు. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది. మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్.