EG: నిడదవోలు మండలం శెట్టిపేటలో గురువారం బావ, బావమరిది మధ్య జరిగిన గొడవ దాడికి దారితీసింది. కుటుంబ కలహాల కారణంగా ఎర్రంశెట్టి పాండురంగపై అతని బావమరిది బయ్యే వినీల్ కుమార్ దాడి చేశాడని స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగన్మోహన్ రావు తెలిపారు.