MBNR: పేదల సొంతింటి కల ప్రజాపాలనలో సాకారమవుతుందని గురువారం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ రూరల్ మండలంలోని ఇప్పలపల్లిలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇంటిని ఆయన రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. దశలవారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధి చేకూర్చుతామని ఎమ్మెల్యే వెల్లడించారు.