దేశ ఇంధన అవసరాలు, బొగ్గు శాఖ పనితీరుపై ప్రధాని మోదీ ఇవాళ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. బొగ్గు ఉత్పత్తి, సరఫరా, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. శాఖాపరమైన సవాళ్లు, భవిష్యత్ కార్యాచరణపై ప్రధాని దిశానిర్దేశం చేస్తారు.