సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 2026 నూతన సంవత్సర వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ఇన్సిడెంట్ ఫ్రీ/ యాక్సిడెంట్ ఫ్రీగా ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎస్పీ కె.నరసింహ తెలిపారు. జిల్లా పోలీసుల ముందస్తు పకడ్బందీ నిరంతర నిఘా, క్షేత్రస్థాయి సమన్వయంతో అమలు చేసిన భద్రతా చర్యల ఫలితంగా నూతన సంవత్సర వేడుకలు సజావుగా జరిగాయన్నారు.