ADB: జిల్లాలో పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ ద్వారా రికవరీ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 200 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. వాటి విలువ సుమారు రూ. 39 లక్షలు ఉంటుందని వెల్లడించారు. నూతన సంవత్సరం సందర్భంగా బాధితుల్లో ఆనందం వ్యక్తం కాగా, ఎస్పీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.