BDK: ఇల్లందు మండలం పోచారం తండా సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మేకలు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సంచార జీవుల మేకల ట్రాలీ, గుండాల మండలం శెట్టిపల్లి నుండి మేత కోసం వెళ్తుండగా పోచారం గుట్ట వద్ద అదుపుతప్పి పల్టీ కొట్టింది. ట్రాలీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడగా, 15 మేకలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి.