జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సరం వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ముందస్తు కార్యాచరణతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. శాంతిభద్రతల కోసం ప్రత్యేక పోలీస్ బృందాలతో పర్యవేక్షణ చేపట్టామని చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 138 మందిని పట్టుకున్నామని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.