Ukrainian Soldiers Killed By Russia : తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 234 మంది ఉక్రెయిన్ ఫైటర్లను( Ukraine Fighters) తమ సైన్యం హతమార్చిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తమ భద్రతా బలగాలు శత్రు దేశ చొరబాట్లను సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయనని ప్రకటించింది. ఉక్రెయిన్‌కు చెందిన ఏడు యుద్ధ ట్యాంకులు, ఐదు సాయుధ వాహనాలను తమ సైన్యం నాశనం చేసిందని పేర్కొంది. వీటన్నింటితో వారు తమ దేశంలోకి చొరబడి యుద్ధం చేసేందుకు ప్రయత్నాలు చేశారని తెలిపింది.
మంగళవారం రష్యా( Russia) సరిహద్దుల్లో ఉక్రెయిన్ ఫైటర్లు డ్రోన్లతో విరుచుకుపడ్డారు. డ్రోన్లతో జరిపిన దాడుల్లో రెండు ఆయిల్ రిఫైనరీలను చేరాయని రష్యా అధికారులు ప్రకటించారు. తమ దేశంలో మొత్తం ఎనిమిది చోట్ల డ్రోన్లు పడ్డాయని వివరించారు. మాస్కో ఉపరితలంలోకి వచ్చిన డ్రోన్‌ను కూల్చివేశామని చెప్పారు. రష్యా అధ్యక్ష ఎన్నికలకు కొద్ది రోజుల ముందు సరిహద్దుల్లో ఈ గొడవలు ఎక్కువ కావడం గమనార్హం.
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధం కారణంగా మొత్తం 31వేల మంది ఉక్రెయిన్ సైన్యం(Ukrainian Soldiers) మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఈ త్యాగాలు, ప్రాణ నష్టాలు తమను కలవరపరిచాయన్నారు. పదుల వేల సంఖ్యలో ప్రజలు కూడా ఈ కారణంగా మృతి చెందారన్నారు. యుద్ధం ముగిస్తే తప్ప ఎంత మంది చనిపోయారనేది స్పష్టత రాదని తెలిపారు.