మాజీమంత్రి గాలి జనార్ధన్ రెడ్డిపై కాల్పుల ఘటన బళ్లారిలో తీవ్ర కలకలం రేపింది. వాల్మీకి విగ్రహం, ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో గొడవ జరగగా.. MLA భరత్ అనుచరుడు సతీష్ రెడ్డి గన్మెన్ తుపాకీ లాక్కుని 8 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ దాడిలో జనార్ధన్ రెడ్డి త్రుటిలో ప్రాణాలతో బయటపడగా, ఇరువర్గాల కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. గాయపడిన నిందితుడు సతీష్ రెడ్డిని ఆస్పత్రికి తరలించారు.
Tags :