Ramjan : రంజాన్ ఉపవాసాలుండే షుగర్ పేషెంట్లకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. అందుకనే ఈ మాసమంతా వారు ఉపవాసాలు ఉంటారు. అయితే ఇలా ఉపవాసాలు ఉండే వారిలో షుగర్ వ్యాధిగ్రస్తులు గనుకు ఉంటే వారు కచ్చితంగా కొన్ని జాగ్రత్తల్ని పాటించాలి. అవేంటంటే...
Ramadan Fasting Tips : రంజాన్ మాసం అంతా ముస్లింలు కఠోర ఉపవాసాలు ఉంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో వారు ఈ ఉపవాసాలను చేస్తుంటారు. ఆరోగ్యం సాధారణంగా ఉన్న వారికి ఇది మంచిదే కానీ షుగర్ వ్యాధిగ్రస్తులకు మాత్రం ఇలా ఉపవాసాలు(Fasting) చేయడం వల్ల కొన్ని ఆరోగ్య ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మధుమేహం ఉన్న వారు మాత్రం ఈ రంజాన్ రోజుల్లో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
రంజాన్(Ramjan) మాసంలో రోజా ఉండే వారు దాదాపుగా 12 నుంచి 14 గంటల పాటు రోజంతా ఏమీ తినకుండా ఉంటారు. ఆ తర్వాత పండ్లు, నట్స్, గింజలు, ఖర్జూరం లాంటి వాటిని తింటారు. షుగర్ వ్యాధిగ్రస్తులు ఇలా చేయడం వల్ల వారిలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా తగ్గిపోవడం లేదా తిన్నాక ఒక్కసారిగా పెరిగిపోవడం లాంటివి జరగవచ్చు. ఇలా జరిగితే వారికి నీరసం, కళ్లు తిరగడం లాంటి అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
షుగర్ వ్యాధిగ్రస్తులు(Diabetic Patients) ఉపవాసం తర్వాత ఒక్కసారిగా ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారాలను తీసుకోకూడదు. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే సమతుల ఆహారం తీసుకోవాలి. సరళమైన కార్బోహైడ్రేట్ల జోలికి వెళ్లకూడదు. లీన్ ప్రొటీన్లు తీసుకోవాలి. పప్పులు, కూరగాయల్లాంటి వాటిని ఎక్కువగా తినాలి. అలాగే నూనెల్లో వేయించిన పూరీలు, సమోసాలు, మాంసాహారాల్లాంటి వాటిని తీసుకోకుండా ఉండటమే మంచిది. వీటికి బదులుగా ఉడికించిన కూరగాయల్లాంటి వాటిని తినవచ్చు. అలా షుగర్ పేషెంట్లు ఈ ఉపవాస సమయాల్లో నూనెలు, నూనెల్లో వేయించన పదార్థాలను ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. తిన్న వెంటనే నిద్రకు ఉపక్రమించడం కూడా సరైనది కాదు. ఉపవాస సమయంలో కళ్లు తిరగడం, నీరసం ఎక్కువగా ఉండటం లాంటివి ఉంటే తప్పకుండా వైద్యుల్ని సంప్రదించాలి.