MLG: మంగపేట మండలం చుంచుపల్లి వద్ద గోదావరి నది మధ్యలో వెలసిన శివలింగం భక్తులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు పడవలపై నదీ గర్భంలోకి వెళ్లి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి మధ్యలో సహజసిద్ధంగా వెలసిన నంది, శివలింగాలకు నీరాజనాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పూజా కార్యక్రమం భక్తులకు ప్రత్యేక అనుభూతిని కలిగించింది.