ఆసిఫాబాద్ జిల్లాలో నూతన సంవత్సర వేడుకల వేళ మద్యం ఏరులై పారింది. 2025కు వీడ్కోలు పలుకుతూ Dec 31న ఒక్కరోజే రూ. 2.25 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. ఉట్నూర్ IML డిపో నుంచి ముందస్తుగానే భారీగా నిల్వలు తరలించగా, Dec నెలలో మొత్తం అమ్మకాలు రూ. 36 కోట్లకు చేరాయి. పాత ఏడాదికి వీడ్కోలు చెబుతూ మందుబాబులు రికార్డు స్థాయి అమ్మకాలు నమోదు చేశారు.