KMR: తాడ్వాయి మండలం కృష్ణాజీవాడి శివారులో గురువారం రాత్రి ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందారు. దేవాయిపల్లికి చెందిన రాజయ్య వీఆరీగా విధులు నిర్వహిస్తున్నారు. KMR నుంచి స్వగ్రామానికి బైక్పై వెళ్తుండగా నిజాంసాగర్ నుంచి కామారెడ్డి వెళ్తున్న RTC బస్సు కృష్ణాజీవాడి శివారులో మూల మలుపు వద్ద ఢీకొట్టింది. దీంతో రాజయ్య అక్కడిక్కడే మృతి చెందారు.