సత్యసాయి: జిల్లా సామాజిక వనవిభాగం డీఎఫ్వో శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఇవాళ పుట్టపర్తి మండలం అమడగొండపాళెం నగరవనంలో కార్తీక వన సమరాధన కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్, ఉసిరి, తులసి, జమ్మి మొక్కలను నాటినట్లు తెలిపారు. ప్రకృతి పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు.