SRCL: గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలని ఎస్సై రమేష్ అన్నారు. చందుర్తి మండలం మల్యాల, కట్టాలింగంపేట గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలపై ప్రజలకు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ.. గ్రామాల్లో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోటీచేసే అభ్యర్థులు, నాయకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.