CTR: యాదమరి పోలీస్ స్టేషన్ పరిధిలో 13 ఏళ్ల అమ్ము విష పదార్థాలు తినడం కారణంగా మృతి చెందింది. బంగారుపాలెం మండలం జయంతి గ్రామానికి చెందిన ఆమె నెలసరి నొప్పితో బాధపడుతూ, డిసెంబర్ 3న తల్లి మందులు తెచ్చేందుకు వెళ్లిన సమయంలో విషపదార్థాలు తిన్నట్లు తెలిసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.