TG: గ్లోబల్ సమ్మిట్‌కు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 1000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. సెంట్రల్ పోలీస్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేస్తున్నారు. రహదారుల మళ్లింపు, బారికేడ్ల ఏర్పాటు, వాహనాల పార్కింగ్ కోసం ట్రాఫిక్ మార్షల్స్‌ను అందుబాటులో ఉంచనున్నారు.