MDK: రాచపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి చాకలి కేజీయ రూపొందించిన ‘గార్బేజ్ ఎంజాయ్’ నమూనా జిల్లా స్థాయి ఇన్స్పైర్ ప్రదర్శనలో తొలి బహుమతిని దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ చేతుల మీదుగా కేజీయ సర్టిఫికెట్, జ్ఞాపిక అందుకున్నారు.