ఫోర్బ్స్ జాబితా ప్రకారం, బ్రిటన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఏకంగా రూ.4.07 లక్షల కోట్ల విలువతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నివాసంగా అగ్రస్థానంలో ఉంది. ముంబైలోని ముకేష్ అంబానీ ఇల్లు ‘ఆంటిలియా’ రూ.16,640 కోట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో ఫ్రాన్స్‌లోని విల్లా లియోపోల్డా, విల్లా లెస్ సెడ్రెస్, లెస్ ప్యాలెస్ బుల్లెస్ వరుసగా ఉన్నాయి.