TG: కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ ఇంఛార్జ్ వీసీగా కె.రమేష్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇటీవల కాళోజీ వర్సిటీలో పీజీ పరీక్ష పత్రాల్లో జరిగిన అవకతవకల నేపథ్యంలో వీసీ నందకుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంఛార్జ్ వీసీగా యాదాద్రి భువనగిరి వైద్య కళాశాల ప్రిన్సిపల్‌గా ఉన్న రమేష్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది.