SKLM: పొందూరులో గురువారం అర్థ రాత్రి దొంగలు 2 ఇళ్లలో బంగారం, నగదు దొంగిలించారు. గాంధీనగర్ ప్రాంతంలో జరిగిన ఈ చోరీలలో తులం బంగారం, రూ 1.లక్ష , వెండి వస్తువులు అపహరించబడినట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించగా శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.