మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో దివ్యాంగులకు ఈనెల 6 నుంచి 28 వరకు సదరం వైద్యశిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. 6, 7, 9, 12, 18 తేదీల్లో ఆర్థో, 13న వినికిడి, 25న దృష్టి లోపం, 27న మేధో వైకల్యం, 28న తలసేమియా, సికిల్సెల్ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు.