AP: రాష్టాన్ని మోడల్‌గా తీర్చిదిద్దడంలో భాగంగా హనుమాన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ హనుమాన్ ప్రాజెక్ట్ కోసం పూర్తి సాంకేతికతతో కూడిన 100 వాహనాలను ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో 93 ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వాహనాలు కాగా, మరో 7 వాహనాలు వన్యప్రాణుల సంరక్షణకు అవసరమైన అంబులెన్స్‌లు ఉన్నాయని స్పష్టం చేశారు.