భారత్తో వాణిజ్య, ఇతర సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ‘US జాతీయ భద్రతా వ్యూహం’ పేరిట వ్యూహపత్రాన్ని విడుదల చేశారు. ‘దక్షిణ చైనా సముద్రంలో భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్ సహకారం అవసరం. చరిత్రలో US గొప్ప దేశంగా కొనసాగేందుకు ఈ వ్యూహపత్రం మార్గసూచి. USను స్వేచ్ఛాయుత, గొప్ప దేశంగా మారుస్తాం’ అని అన్నారు.