వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు మద్యం తాగి వాహనాన్ని నడిపించే మద్యం బాబులను గుర్తించేందుకు వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రధాన కూడళ్లలో పోలీసులు శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో పాటు వారి వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు.