VKB: కులకచర్ల మండలంలో దట్టమైన పొగమంచుతో రహదారులపై గుంతలు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట ప్రయాణాలను రెండు గంటలు వాయిదా వేసుకుని వెళ్తున్నామని వారు తెలిపారు. వాహనదారులు లైట్ల సాయంతో నెమ్మదిగా వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. వాహనాలపై వెళ్లే ప్రయాణికులు జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు సూచించారు.