MBNR: సర్పంచ్ ఎన్నికల్లో డబ్బులు అధికంగా ఉన్నవారే గెలిచేలా వేలం పాటలు నిర్వహించడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని ఎంపీ డి.కె.అరుణ అన్నారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజలందరూ ఎన్నికల్లో పాల్గొని సర్పంచ్‌ను ఎన్నుకోవాలని కోరారు. ఏకగ్రీవం మంచిదే అయినా, డబ్బులతో కాకుండా ఏకగ్రీవం చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.