మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. కువైట్-శంషాబాద్(KU-373) విమానంతో పాటు బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కువైట్-శంషాబాద్ విమానం మస్కట్‌కు మళ్లించారు. లండన్-శంషాబాద్ విమానం సేఫ్ ల్యాండింగ్ చేశారు. అనంతరం బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.