E.G: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి నుంచి నర్సపురానికి ప్రత్యేక రైలును నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈనెల 26న ట్రైన్ చర్లపల్లిలో రాత్రి 10:40 గం.కు బయలదేరి నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు స్టేషన్ల మీదుగ నరసాపురానికి ఉదయం 9:45 గంటలకు చేరుకుంటుంది.