TG: అర్ధరాత్రి హైదరాబాద్లో 5వేల మంది పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కమిషనరేట్ చరిత్రలో 5 వేల మందితో నాకాబందీ చేయడం ఇదే తొలిసారి. ఈ తనిఖీల్లో సీపీ సజ్జనార్ పాల్గొన్నారు. ఇవాళ బాబ్రీ మసీద్ కూల్చివేసిన రోజు సందర్భంగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ సోదాలు నిర్వహించారు. అనుమానాస్పద కదలికలపై డయల్ 100కి సమాచారం ఇవ్వాలని ప్రజలకు సజ్జనార్ సూచించారు.