MDK: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన 35 మందిపై కేసులు నమోదు చేసినట్లు సిద్దిపేట త్రీ టౌన్ సీఐ విద్యా సాగర్ తెలిపారు. పాండవపురంలోని దేవాలయం వద్ద కొంతమంది సర్పంచిగా పోటీ చేస్తున్న వారితో చర్చలు జరిపారని గత నెల 29వ తేదీన భైరి శంకర్ రూ.16.30 లక్షలకు వేలం పాడినట్లు ఒప్పుకొన్నారన్నారు. వారికి వ్యతిరేకంగా వేలంలో పాల్గొన్న భైరి రాజు నామినేషన్ వేయడంతో కుల బహిష్కరణ చేశారన్నారు.