E.G: ఆకివీడులో సుమారు 40 డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన దాదాపు రూ. కోటి మేర నిధులను యానిమేటర్ టోకరా వేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. యానిమేటర్‌గా ఉన్న సుధా అనే మహిళ, బ్యాంకు లావాదేవీలకు సొమ్ము జమ చేయకుండా, లోన్ల మొత్తాలను కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా అక్రమాలకు పాల్పడినట్లు వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు అధికారులను ఆశ్రయించారు.