నెల్లూరులోని పెన్నా బ్రిడ్జి మీద నుంచి గుర్తు తెలియని మహిళ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల నుంచి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతురాలి వివరాలు తెలియకపోవడంతో వివరాలు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసిన నవాబ్ పేట పోలీసులు ఎవరికైనా వివరాలు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.